ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ

ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను శుక్రవారం మున్సిపల్ చైర్మెన్ బృంగి రత్నమాల, వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్ పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మెన్ మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ప్రతి పండుగను సోదరభావంతో జరుపుకోవాలని, ముస్లింలు సంతోషంగా పండుగ జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఆశయమని ఆమె పేర్కొన్నారు.