సర్పంచ్‌గా పెరుగు రవి విజయం

సర్పంచ్‌గా పెరుగు రవి విజయం

మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్నతిమ్మాపూర్ లో ఆదివారం జరిగిన రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాలలో సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన పెరుగు రవి ఘన విజయం సాధించాడు. సమీప ప్రత్యర్థిపై 141 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. దీంతో ఆయన మద్దతుదారులు గ్రామంలో సంబరాలకు సిద్ధమయ్యారు. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.