'పద్ధతులు మార్చుకోకుంటే లైసెన్స్ రద్దు చేస్తాం'

'పద్ధతులు మార్చుకోకుంటే లైసెన్స్ రద్దు చేస్తాం'

మన్యం జిల్లాలోని వినియోగదారుల ఇంటి వద్దకే గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేయాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి గ్యాస్ ఏజెన్సీ డీలర్లకు స్పష్టం చేశారు. గ్యాస్ డెలివరీని ఉచితంగా చేయాల్సి ఉన్నప్పటికీ, చార్జీలను వసూలు చేస్తే ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. అటువంటి డీలర్లు ఉంటే పద్ధతులు మార్చుకోవాలని, లేదంటే లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.