RAIN ALERT: తమిళనాడులో భారీ వర్షాలు
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో నాగపట్నంలో అత్యధికంగా 16 సెం.మీ. వర్షపాతం నమోదైంది. విల్లుపురంలో కుండపోత వర్షానికి స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పుదుచ్చేరిలో కురుస్తున్న కుండపోత వర్షాలకు పలు కాలనీలు నీటమునిగాయి. దీంతో పుదుచ్చేరికి వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీరప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆదేశించారు.