పాలకుర్తిలో రేపు TRP సమావేశం

పాలకుర్తిలో రేపు TRP సమావేశం

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శివం గార్డెన్‌లో మంగళవారం జరగబోయే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జి సింగారపు రవీందర్ పిలుపునిచ్చారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తీన్మార్ మల్లన్న హాజరవుతారని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీనీ బీసీ సమాజం పెద్ద ఎత్తున ఆదరించాలని కోరారు.