'స్వయంకృషితో ఎదిగిన శ్రమజీవి రామోజీరావు'

'స్వయంకృషితో ఎదిగిన శ్రమజీవి రామోజీరావు'

AP: రామోజీరావు జయంతి సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నివాళులర్పించారు. స్వయంకృషితో మహావృక్షమై ఎదిగిన శ్రమజీవి రామోజీరావు అని కొనియాడారు. అతి సామాన్యుడిగా జీవితం ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగారని ప్రశంసించారు. ప్రతికూల పరిస్థితుల్ని సానుకూలంగా మలుచుకోవడం రామోజీరావు ప్రత్యేకత అని చెప్పారు.