గ్యాస్ సిలిండర్ల పేరుతో సైబర్ మోసాలు: ఎస్పీ

గ్యాస్ సిలిండర్ల పేరుతో సైబర్ మోసాలు: ఎస్పీ

VKB: వంట గ్యాస్ సిలిండర్ల కొరతను సాకుగా చూపుతూ సైబర్ కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ప్రజలను అప్రమత్తం చేశారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని, తక్షణ డెలివరీ, అదనపు సిలిండర్లంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. అధికారిక యాప్‌ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలన్నారు.