గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి

గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి

MBNR: జడ్చర్లలో సోమవారం రాత్రి గొంతులో గుడ్డు ఇరుక్కొని ఊపిరాడక ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. చైతన్యనగర్ కాలనీకి చెందిన పాండుకుమార్ (43) ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా, ఉడకబెట్టిన గుడ్డు గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి ఆడక ఇబ్బందిపడిన అతడిని కుటుంబసభ్యులు జడ్చర్ల సర్కారు దవాఖానకు తరలించారు. మంగళవారం చికిత్స అందిస్తుండగా పాండు మృతి చెందాడు.