ఎమ్మెల్యేని కలిసిన డీసీసీబీ ఛైర్మన్

ఎమ్మెల్యేని కలిసిన డీసీసీబీ ఛైర్మన్

SKLM: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఛైర్మన్‌గా నియమితులైన శివ్వాల సూర్యనారాయణ ఆదివారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. రణస్థలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు చేరుకున్న ఆయనను ఎమ్మెల్యే దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.