జూనియర్ వాలీబాల్ ఫైనల్‌లో మహబూబ్-వరంగల్

జూనియర్ వాలీబాల్ ఫైనల్‌లో మహబూబ్-వరంగల్

MBNR: సిరిసిల్లలో జరుగుతున్న 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌లో బాలికల విభాగంలో మహబూబ్నగర్, వరంగల్ జట్లు ఫైనల్‌కు చేరాయి. ఉదయం జరిగిన సెమీఫైనల్‌లో మహబూబ్నగర్ జట్టు నిజామాబాద్‌పై గెలిచింది. రెండో సెమీలో వరంగల్ జట్టు నల్గొండను ఓడించి ఫైనల్‌ బెర్త్ దక్కించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.