ఈనెల 20న రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికలు
శ్రీకాకుళం నగర పరిధిలోని జిల్లా చెస్ అసోసియేషన్ శిక్షణ కేంద్రంలో ఈ నెల 20న రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా చెస్ ఇన్ స్కూల్ శిక్షకుడు సనపల భీమారావు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 9912559735కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలన్నారు. ఎంపికైన వారికి రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నారు.