VIDEO: మైసమ్మ ఆలయంలో హుండీ చోరీ

MDCL: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. చిర్యాల గ్రామంలో రాత్రుల్లో ఆగి ఉన్న వాహనాల నుంచి బ్యాటరీలను దొంగలించారు. వారం రోజుల వ్యవధిలోనే అదే గ్రామంలో మైసమ్మ ఆలయంలో మరో దొంగతనం జరిగింది. తలుపు పగలగొట్టి ఆలయంలో హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.