'ప్రజలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ముందు'
BDK: లయన్స్ క్లబ్ అశ్వాపురం స్టార్స్ ఆధ్వర్యంలో 20 మంది పేషంట్లను శనివారం వైరాలోని లయన్స్ కంటి ఆసుపత్రికి కంటి ఆపరేషన్ల నిమిత్తం లయన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసిన రెండు వాహనాలలో పంపించారు. ప్రజలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ముందు ఉంటుందని, డిసెంబర్ నెలలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.