విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

E.G: దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో బాదంపూడి ప్రవీణ్ (19) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. శనివారం రాత్రి ఆయన పక్కింటి వద్ద మోటార్ కలెక్షన్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ప్రవీణ్‌ను మొదట దేవరపల్లి, ఆ తర్వాత కొవ్వూరు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు.