యమహా నుంచి XSR 155.. ధర ఎంతంటే?

యమహా నుంచి XSR 155.. ధర ఎంతంటే?

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా కొత్త బైకును XSR 155 పేరిట మార్కెట్‌లో లాంచ్ చేసింది. దీని ధర రూ.1.50 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ఈ బైకులో 155CC లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఉంది. ఇది గరిష్ఠంగా 10,000 RPM వద్ద 18.4 HP శక్తిని విడుదల చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చారు. లుక్ పరంగా FZ-X మోడల్‌ను తలపిస్తోంది.