కబడ్డీ ఆడి ఉత్సాహపరిచిన మంత్రి రోజా

విశాఖ: ‘ఆడుదాం ఆంధ్రా' ఫైనల్స్ కార్యక్రమంలో మంత్రి రోజా సందడి చేశారు. జిల్లాలోని ఏయూలో జరుగుతున్న కబడ్డీ ఫైనల్‌ను ప్రారంభించిన ఆమె.. కాసేపు కబడ్డీ ఆడి అలరించారు. 'ట్వంటీ ట్వంటీ ఫోర్.. జగనన్న వన్స్ మోర్' అంటూ కూతకు వెళ్లారు. అనంతరం మాట్లాడిన రోజా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సీఎం జగన్ క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నారని అన్నారు.