మల్లాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య
JGL: జగిత్యాలలో మల్లాపూర్ మండలంలో బుధవారం ఉదయం దారుణ హత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలానికి చెందిన పల్లికొండ మల్లయ్యను ఇంట్లో దారుణంగా గొంతు కొసి హత్య చేసినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మల్లయ్యను భార్యే హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.