'వాట్సప్ ద్వారానే ప్రజలకు ప్రభుత్వ సేవలు అందాలి '

విజయనగరం: ప్రభుత్వ సేవల కోసం ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలకు రానవసరం లేకుండా రానున్న రోజుల్లో అన్ని సేవలను వాట్సప్ గవర్నెన్స్ ద్వారానే అందించాలని రాష్ట్ర జీ.ఎస్.టీ.సహకార శాఖల కమిషనర్, జిల్లా ప్రత్యేక అధికారి డా.ఏ.బాబు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని 41వ నెంబరు వార్డు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.