ఓకే గుడ్డులో రెండు కోడి పిల్లలు

ఓకే గుడ్డులో రెండు కోడి పిల్లలు

ASR: ఒక కోడిగుడ్డులో ఒక్క పిల్ల పుట్టడం సహజం. అందుకు భిన్నంగా ఒకే గుడ్డు‌లో రెండు కోడి పిల్లలు పుట్టుకొచ్చాయి. జీకేవీధి (M) కొత్తగూడెంలో బుడి ప్రసాద్ అనే గిరిజనుడి నాటు కోడిపెట్ట గుడ్లు పెట్టింది. శుక్రవారం ఆ గుడ్లు పొదిగే సమయంలో ఒక గుడ్డులో రెండు పిల్లలు పుట్టి కొద్ది సేపటికే చనిపోయాయి. జన్యుపరమైన సమస్య వల్లే ఇలా జరుగుతుందని పశు వైద్యాధికారి రమేష్ తెలిపారు.