ఆర్థిక సహాయం అందజేసిన ఎస్పీ
SKLM: ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ విభాగంలో హోంగార్డుగా సేవలందించి పదవీ విరమణ పొందిన పి.సన్యాసిరావుకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శ్రీ కెవి మహేశ్వరరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. రెగ్యులర్ పోలీసులు నిర్వహించిన విధంగానే హోంగార్డుల సైతం తమ విధులను నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు సత్కరించి జ్ఞాపికను అందజేశారు.