అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం పరిపాలన భవన్ నిర్మాణానికి జరగనున్న భూమి పూజ స్థలాన్ని సందర్శించారు.