పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

GNTR: సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జిల్లాలో చురుగ్గా సాగుతోంది. కలెక్టర్ తమీమ్ అన్సారియా గుంటూరులోని ఏటీ అగ్రహారం వృద్ధుల ఆశ్రమంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సోమవారం ఉదయం నుంచే పంపిణీ విధానాన్ని పరిశీలించిన ఆమె, సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు ఆర్థిక చేయూత కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఆమె వెంట పలువురు అధికారులు ఉన్నారు.