CCPL సీజన్ 3 విజేతగా డీఎస్ టైటాన్స్

BHPL: చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన CCPL సీజన్ 3 శనివారం రాత్రి ముగిసింది. డీఎస్ టైటాన్స్ విన్నర్‌గా, చిట్యాల రాయల్-11 రన్నర్‌గా నిలిచాయి. విన్నర్ టీమ్‌కు రూ.1 లక్ష, రన్నర్ టీమ్‌కు రూ.50 వేల బహుమతిని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి, క్రీడల్లో రాణించాలని ఆయన సూచించారు.