ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

WNP: మదనాపురం మండల కేంద్రంలో వడ్డే సత్యమ్మ, వడ్డే రేణుకల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే బీఆర్ఎస్ ఓర్వలేక పోతుందన్నారు.