ప్రారంభమైన ఆలిండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్

ఢిల్లీలో ఆలిండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సదస్సును ప్రారంభించారు. ఢిల్లీ అసెంబ్లీ భవనంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం సాగనుంది. రేపు జరగబోయే ముగింపు కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాల సభాపతులతో పాటు మరో 30 మంది స్పీకర్లు పాల్గొననున్నారు.