ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం ప.గోనే.!
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా పండించే పంట వరి. ఈ జిల్లాను "ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం" అని కూడా పిలుస్తారు. రాష్ట్రంలోని మొత్తం వరి ఉత్పత్తిలో ప.గోదే మొదటి స్థానం. గోదావరి డెల్టా ప్రాంతం కావడం వల్ల సారవంతమైన నేల, సమృద్ధిగా నీటి వనరులు ఉండటం వల్ల ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ వరి సాగు ఎక్కువగా జరుగుతుంది.