VIDEO: కాంగ్రెస్ వైఖరిపై BRS నిరసన

ADB: యూరియా కొరతపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆదివారం ఇచ్చోడ మండల కేంద్రంలో BRS ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీఎసీఎస్ కేంద్రాల వద్ద రైతులు రాత్రింబవళ్లు యూరియా కోసం పడగాపులు గాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, పాండురంగ తదితరులు ఉన్నారు.