ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన: ఎమ్మెల్యే

KMM: అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన చేస్తుందని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.