నియామక పత్రం అందుకున్న పత్తి విజ్ఞ తేజ
NRML:తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ నిర్మల్ జిల్లా ఇన్చార్జిగా పట్టణానికి చెందిన పత్తి విజ్ఞ తేజ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాదులోని ఆర్యవైశ్య కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం ఛైర్మన్ కల్వ సుజాత గుప్త నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆర్యవైశ్యులకు అందేలా కృషి చేస్తానన్నారు.