నియోజకవర్గ అభివృద్ధే నా ప్రధాన ఎజెండా: కడియం

JN: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి నా ప్రధాన ఏజెండా అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సమిష్టిగా పని చేసి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.