యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో
BHNG: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా రేపు గిరి ప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన పేర్కొన్నారు.