'పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి'
సిరిసిల్ల జిల్లాలోని ఉన్నత పాఠశాలలో పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ నిన్న అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలపై లైంగిక నేరాల నివారణ, ఫోక్సో చట్టం కింద ఉన్న కఠిన శిక్షలు, బాధిత పిల్లల ప్రతి ఒక్కరూ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు.