రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నంద్యాల: శిరివెళ్ల మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుచ్చేరి వెళ్తున్న శ్రీవాసవి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. కానీ బస్సులో ఉన్నవారికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు.