విషాదం.. తల్లీకూతుళ్లు మృతి

GNTR: పొన్నూరు మండలం జూపూడి గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వర్షంలో తడిసిన దుస్తులు తీసే సమయంలో విద్యుత్ తీగ తగలడంతో రెమ్మళ్ల భాగమ్మ (63), ఆమె కుమార్తె పిచ్చిమ్మ (42) అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని రక్షించే ప్రయత్నంలో కుమార్తె కూడా విద్యుద్ షాక్‌కు గురైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.