వినాయక మండపాలను పరిశీలించిన CI

వినాయక మండపాలను పరిశీలించిన CI

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న వినాయక మండపాలను సీఐ సాయి రమణ శనివారం రాత్రి పరిశీలించారు. మండపాలకు తప్పనిసరిగా పర్మిషన్ ఉండాలని, రోడ్డుపై అడ్డుగా ఉన్న స్టేజీలను పక్కకు జరపాలని నిర్వాహకులకు సూచించారు. లేనిపక్షంలో ఆదివారం ఉదయం స్టేజీలను తొలగిస్తామని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.