విశాఖలో కూలిపోయిన షాపింగ్‌ మాల్‌

విశాఖలో కూలిపోయిన షాపింగ్‌ మాల్‌

విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్‌లో గ్రీన్‌బెల్ట్‌ను ఆక్రమించి నిర్మిస్తున్న షాపింగ్‌మాల్‌లో భాగం ఆదివారం కూలిపోయింది. నాణ్యతా లోపమే కారణమని స్థానికుల అభిప్రాయం. విషయం బయటకు రాకుండా తొందరగా శిథిలాలను తొలగించారు. నిర్మాణంపై చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతున్నారు.