అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం
SKLM: కొత్తూరు మండలం చిన్నారాజపురం గ్రామానికి చెందిన సవర జ్యోతమ్మకు పురిటి నొప్పులు రాగా, కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే స్పందించి గ్రామానికి చేరుకున్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువవడంతో అంబులెన్స్‌లోనే సుఖ ప్రసవం చేశారు. తల్లి, శిశువును హిరమండలం పీహెచ్‌సీకి తరలించారు.