ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఇబ్బందులు

ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఇబ్బందులు

PDPL: సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ఆరోగ్య కేంద్రంలో చాలీచాలని గదులతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో వేచి ఉండే గది లేక రోగులు ఆరుబయటే నిలబడాల్సి వస్తోందని, గర్భిణుల పరీక్షలకు ప్రత్యేక గది లేక ఇబ్బందులు పడుతున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేసి, అదనపు గదులు నిర్మించాలని కోరుతున్నారు.