వేమవరంలో 13సవర్ల బంగారం చోరీ

PLD: మాచవరం మండలం వేమవరంలో సోమవారం తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన జక్కుల సైదులు ఇంట్లో 13 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఉదయం పొలం పనుల నిమిత్తం వెళ్లిన సైదుల కుటుంబం సాయంత్రం ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో బీరువాలో ఉన్న నగదు అపహరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.