ఉరేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
ATP: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనంతపురం శివారు లోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు హరిప్రసాద్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు.