బెంగళూరు ట్రాఫిక్‌పై శుభాన్షు శుక్లా సెటైర్లు
బెంగళూరు ట్రాఫిక్‌పై వ్యోమగామి శుభాన్షు శుక్లా సెటైర్లు వేశారు. అంతరిక్షయానంపై తాను చేసే ప్రసంగ సమయంతో పోలిస్తే బెంగళూరు రహదారులపై ప్రయాణం మూడు రెట్లు అధికమని వ్యాఖ్యానించారు. ఆయన గురువారం బెంగళూరు టెక్నాలజీ సమ్మిట్‌లో హాజరయ్యే క్రమంలో మారతహళ్లి నుంచి మూడు గంటలపాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇందులో మూడో వంతు సమయంలోనే తాను ప్రసంగాన్ని పూర్తి చేశానన్నారు.