అత్యాచార నిందితుడికి 20 ఏళ్ల కారాగార శిక్ష
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి కోర్టు కఠిన కారాగార శిక్షను విధించింది. త్రిపుర ఖోవాయి జిల్లాలోని ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన సమీర్ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన కోర్టు సమీర్ దోషిగా తేలడంతో అతడికి 20 ఏళ్ల పాటు కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానాను విధించింది.