బంగారిగూడలో కార్డెన్ అండ్ సెర్చ్
ADB: ప్రజల రక్షణ, సంరక్షణ కోసం కార్డెన్ అండ్ సెర్చ్‌లను నిర్వహిస్తున్నట్లు AR DSP కమతం ఇంద్రవర్ధన్ తెలిపారు. ఇవాళ ఆదిలాబాద్‌లోని బంగారి గూడలో నిర్వహించిన ఈ తనిఖీలో సరైన ధృవపత్రాలు లేని 60 బైక్‌లు, 10 ఆటోలు, రెండు మ్యాక్స్ వాహనాలను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్దంగా అక్రమ మద్యం అమ్ముతున్న మూడు బెల్ట్ షాపులను కూడా జప్తు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.