BREAKING: అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి

BREAKING: అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి

ఒడిశాలోని కటక్ SCB మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. రాష్ట్ర సీఎం ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.