గోవాలో విదేశీ యువతులకు చేదు అనుభవం

గోవాలో విదేశీ యువతులకు చేదు అనుభవం

గోవా పర్యటనకు వచ్చిన ఇద్దరు విదేశీ యువతులతో కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. ఆరంబోల్ బీచ్‌లో వారి మీద చేతులు వేస్తూ ఫొటోలు దిగారు. స్థానికులు కలగజేసుకోవడంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. గోవాలోని వాగాటోర్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. వారణాసి నుంచి వచ్చిన ఓ కుటుంబంతో స్థానిక బౌన్సర్లు ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించారు. ఈ ఘటనలపై గోవా టూరిజం శాఖ చర్యలు చేపట్టింది.