అనఘాష్టమి వ్రతం నిర్వహించిన మంత్రి
WGL: శివానగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం అనఘాష్టమి వ్రతంను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనఘాష్టమి వ్రతం భక్తులకు పాప విమోచన కలిగిస్తుందని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.