'ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి'

'ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి'

AKP: ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ కె. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ అచ్యుతాపురంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఏపీటీఎఫ్ నిర్వహిస్తున్న నిరసన వారం కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు అందజేసామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు.