దుళ్లలో ముస్లింలకు రంజాన్ కిట్లు పంపిణీ

దుళ్లలో ముస్లింలకు రంజాన్ కిట్లు పంపిణీ

E.G: కడియం మండల దుళ్లలో సుమారు 35 కుటుంబాలకు అదే గ్రామానికి చెందిన దాత, సామాజికవేత్త కంటిపూడి కిరణ్ కుమార్ అపరాల కిట్లు అందజేశారు. రంజాన్ సందర్భంగా సుమారు రూ.20 వేలు విలువైన కిట్లను శుక్రవారం అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్‌లు కిరణ్ సేవలను అభినందించారు.