ఇంటర్ లింక్ లైన్ విజయవంతంగా పూర్తి చేసాం: అశోక్
SRCL: గంభీరావుపేట సెక్షన్ పరిధిలో 3 కిలోమీటర్ల 33 కేవీ ఇంటర్ లింక్ లైన్ విజయవంతంగా పూర్తి చేసామని NPDCL చీఫ్ ఇంజనీర్ అశోక్ అన్నారు. గంభీరావుపేటలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఇంటర్ లింక్ లైన్ ప్రారంభంతో కొత్తపల్లి, శ్రీ గాద, కొల్లమద్ది, రాజుపేట గ్రామాలకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు.