పాలేరు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

KMM: కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లో ఇవాళ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై నాగరాజు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. సాగర్ ఎడమ కాల్వలో కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.